Home / లిటిల్ చాంప్స్ / 9న మెరిట్‌ స్కాలర్‌షిప్‌ టెస్టు

9న మెరిట్‌ స్కాలర్‌షిప్‌ టెస్టు

ఎన్టీఆర్‌ ట్రస్టు బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే విద్యార్థినులకు 9న మెరిట్‌ స్కాలర్‌షిప్‌ టెస్టు నిర్వహించనున్నట్లు ట్రస్టీ నారా బ్రాహ్మణి తెలిపారు. ఈ పరీక్ష ద్వారా తెలంగాణ, ఏపీల్లో 25 మంది విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌ అందించనున్నట్లు చెప్పారు. ఎంపికైన 25 మందిలో మొదటి 10 మందికి రూ.5వేలు, తరువాతి 15 మందికి రూ.3వేల చొప్పున ప్రతినెలా ఇంటర్‌ పూర్తిచేసేవరకూ స్కాలర్‌షిప్‌ అందిస్తామని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థినులు పూర్తి వివరాలను www.ntrtrust.org వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలన్నారు.

Check Also

పరగడపున నీరు త్రాగడం వల్ల

సౌజన్యంతో-హరి ప్రసాద్ ఆచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *