Home / slideshow / సిట్రస్ ఫలాలతో కిడ్నీలో రాళ్లకు చెక్

సిట్రస్ ఫలాలతో కిడ్నీలో రాళ్లకు చెక్

కొంతమందికి కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి.  శస్త్రచికిత్స చేయించినప్పటికీ తిరిగి మళ్లీ మళ్లీ వస్తుంటాయి. ఈ సమస్యను దూరం చేయడానికి రోజూ నారింజ పండ్ల రసాన్ని తాగాలంటున్నారు వైద్యులు. శరీరంలో కాల్షియం గాఢత మరింతగా పెరిగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. శస్త్రచికిత్స చేయించినప్పటికీ మళ్లీ తిరిగి వస్తుంటాయి. మనం పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు వాడితే ఈ సమస్యను కొంత మేర దూరం చేయవచ్చు. అయితే కొందరిలో ఇది జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావాలను చూపిస్తుంది. అందువల్ల ప్రకృతి సిద్ధంగా సిట్రేట్‌లు లభించే సిట్రస్ ఫలాలను తినడం ఉత్తమమని వైద్యనిపుణులు అంటున్నారు. అన్ని సిట్రస్ పండ్లతో పోల్చితే నారింజ పండు మరింత మెరుగ్గా పనిచేస్తుందని అంటున్నారు. మూత్రంలో ఆమ్లత్వం తగ్గడం వల్ల సిట్రేట్లు రాళ్లు ఏర్పడడాన్ని నిరోధిస్తుంది.

Check Also

వాట్సప్‌లో రాబోతున్న మరిన్నికొత్త ఫీచర్లు

వాట్సప్ కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులో తేనుందే. ఆ రాబోవు ఫీచర్లు ఏంటో చూద్దాం. యూట్యూబ్‌ వీడియో ప్లే ఐఓఎస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *