Home / slideshow / వాట్సప్‌లో రాబోతున్న మరిన్నికొత్త ఫీచర్లు

వాట్సప్‌లో రాబోతున్న మరిన్నికొత్త ఫీచర్లు

వాట్సప్ కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులో తేనుందే. ఆ రాబోవు ఫీచర్లు ఏంటో చూద్దాం. యూట్యూబ్‌ వీడియో ప్లే ఐఓఎస్‌ బీటా వెర్షన్‌తో యూట్యూబ్‌ ఇంటిగ్రేషన్‌ ఫీచర్‌ను అందుబాటులో తేనుంది. ఫిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ మోడ్‌ ద్వార యాప్‌ను సైన్ అవుట్ చేయకుండా యూట్యూబ్‌ వీడియోలను చూడవచ్చు. యూపీఐ ఆధారిత నగదు లావాదేవీలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాట్సప్ ద్వారా చేసుకునే సౌలభ్యం కలిగించనుంది.  వాట్సప్ మరియు యూపీఐ కలయిక కోసం ప్రభుత్వంతో అనుమతి కోరుతోంది. పొరపాటున పంపిన మెసేజ్‌లను, వీడియోలను, ఇమేజ్‌లను తిరిగి వెనక్కి తీసుకోవడానికి రీకాల్ ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఐదు నిమిషాల విండో సహాయంతో పొరబాటున ఎవరికైనా మెసేజ్‌లనుకానీ, ఇమేజ్‌లనుకానీ పంపితే తిరిగి వాటిని రీకాల్ చేసుకోవచ్చు.

మరో ఫీచర్ లైవ్‌-లొకేషన్‌ షేరింగ్‌. ఈ ఏడాది ప్రారంభంలో ఐఓఎస్‌ బీటా వెర్షన్లలోకి వచ్చిన మరో ఫీచర్‌ లైవ్‌-లొకేషన్‌ షేరింగ్‌. కానీ దీన్ని ఇప్పుడే అందరికీ ప్రారంభించకపోవచ్చు. లైవ్‌-లొకేషన్‌ షేరింగ్‌ ఫీచర్‌ సహాయంతో వినియోగదారులు ఒక నిమిషం, రెండు నిమిషాలు, ఐదు నిమిషాలు లేదా నిరవధిక కాలవ్యవధిలో లైవ్‌-లొకేషన్‌ను షేర్‌ చేయకోవచ్చు. వాట్సప్ వినియోగదారులు ఎవరైనా నెంబర్లు మార్చితే కాంటాక్ట్‌ లోని అందరి వినియోగదారులకు తెలుస్తుంది. ఎవరైనా వాట్సప్‌ వినియోగదారులు తమ నెంబర్‌ను మార్చితే అందరి కస్టమర్లకు నోటిఫికేషన్ వెళ్తుంది. బీటా వెర్షన్‌, విండోస్‌ ఫోన్లలో ఈ ఫీచర్ ఉంది. మరో ఫీచర్ ఎడిట్‌ ఫీచర్‌. యూజర్లు పంపిన మెసేజ్‌లలో టెక్ట్స్ లో ఎలాంటి తప్పులు గుర్తించిన టెక్ట్స్ ను ఈ ఫీచర్‌తో ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ లేటెస్ట్ మెసేజ్‌లను మాత్రమే వర్తిస్తుంది. పాత మెసేజ్‌లను మార్చుకోలేము. పైన చెప్పబడిన ఫీచర్లన్ని త్వరలో వాట్సప్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Check Also

తేనెతో శ్వాసకోస సమస్యలు దూరం

జ‌లుబు, ద‌గ్గు, బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్షన్లలను తేనెతో దూరం చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *