Home / slideshow / రోజూ నడిస్తే..అనారోగ్యం దూరం

రోజూ నడిస్తే..అనారోగ్యం దూరం

ప్రతి మనిషి రోజూ నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ కనీసం 20-30 నిమిషాల పాటు నడిస్తేగానీ మరియు మంచి నిద్రతో ఆరోగ్యంగా జీవించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. అంతేకాక ఆయుష్షు కూడా పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. నడకవల్ల ప్రధానంగా గుండెపోటు, కాలేయ సమస్యలు, కేన్సర్ వంటి వ్యాధులు దూరమవుతాయి. దాంతో ఆయుష్షు పెరుగుతుంది. దానికిగాను కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు వైద్యులు.

అందులో భాగంగా ఆల్కహాల్ తాగడం, పొగాకు వాడటం లేకుంటే ఆయుష్షు పెరుగుతుంది. ఆల్కహాల్‌ను తీసుకోకుంటే లివర్‌ క్షేమంగా ఉంటుంది. బరువు తగ్గడంతోపాటు హాయిగా నిద్ర పడుతుంది. అలాగే వ్యాయామం కూడా రోజూ చేయాలి. రోజూ 20- 30 నిమిషాలపాటు నడిస్తే కొలెస్ట్రాల్‌ తగ్గి గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. అంతేకాక రక్తపోటును నియంత్రిస్తుంది. పొగాకు వాడకపోవడం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్, గుండెనొప్పి రాకుండా ఉంటుంది. ఆహారంలో షుగర్‌న్ని తగ్గించడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ దరిచేరనివ్వదు. ప్రశాంతంగా ఉంటే అధిక రక్తపోటును నియంత్రించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Check Also

వాట్సప్‌లో రాబోతున్న మరిన్నికొత్త ఫీచర్లు

వాట్సప్ కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులో తేనుందే. ఆ రాబోవు ఫీచర్లు ఏంటో చూద్దాం. యూట్యూబ్‌ వీడియో ప్లే ఐఓఎస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *