Home / ధర్మ సందేశ్ / యోగ సాధనలో మంచి ఫలితాలకోసం…

యోగ సాధనలో మంచి ఫలితాలకోసం…

యోగా సాధనలో భాగంగా కొన్ని శరీరక, మానసిక నియమాలు తప్పని సరిగా ఆచరించాలి.ఉదయం యోగాను అభ్యసించేటప్పుడు మనస్సు ప్రశాంతంగా, తాజాగా, శరీరం తేలికగా ఉండాలి.
ఉదయం పడక నుంచి లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవడంలో భాగంగా ముఖం, నాసికా రంధ్రాలు, గొంతును బాగా శుభ్రం చేసుకోవాలి.
కాలకృత్యాల అనంతరం ఓ గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగిన తర్వాత యోగాను ప్రారంభించాలి.
యోగావల్ల డిప్రెషన్ పోయి అంతర్గత శక్తిని పుంజుకోవాలే తప్ప నీరసించకూడదు. ప్రాణాయామం సమయంలో మరీ కష్టంగా భావిస్తే ఆపేయాలి.
యోగాసనాలు వేసే సమయంలో లయబద్ధంగా, చాలాసేపు శ్వాస పీల్చుకోవడం మంచిది. శ్వాస పీల్చుకునేటప్పుడు నోరు మూసుకోవడం మంచిది.

Check Also

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి

ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *