Home / ఈవ్స్ స్పెషల్ / యువతిపై ఆటోడ్రైవర్ అసభ్య ప్రవర్తన

యువతిపై ఆటోడ్రైవర్ అసభ్య ప్రవర్తన

ఆటోను దారి మళ్లించి, ఓ యువతిపై అసభ్యంగా ప్రవర్తించేందుకు డ్రైవర్ ప్రయత్నించిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో చోటు చేసుకుంది. విశాఖపట్నంకు చెందిన బీటెక్‌ చదివిన ఆ యువతి హైటెక్‌ సిటీ సమీపంలోని కొండా పూర్‌లో స్నేహితుల వద్ద ఉంటూ, కూకట్‌పల్లి పీజీ గ్రీన్‌హోంలోని ట్రైనింగ్‌ సెంటర్‌లో చేరింది. సంగా రెడ్డి జిల్లా కందిలోని ఐఐటీలో తన స్నేహితుల వద్దకు వెళ్లే క్రమంలో కంది బస్టాప్‌ నుంచి ఆటోలో బయలుదేరింది. రెండు నిమిషాల వ్యవధిలో ఐఐటీ హాస్టల్‌కు చేరుకునే అవకాశం ఉన్నా డ్రైవర్‌ దారి మళ్లించాడు. అనుమానం వచ్చి తన సెల్‌ఫోన్‌ నుంచి రూట్‌ సెర్చ్‌ చేయగా రాంగ్‌రూట్‌లో వెళ్తున్నట్టు గుర్తించింది. ఇదే విషయాన్ని తన స్నేహితురాలికి సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చింది. రాంగ్‌రూట్‌లో వెళుతున్నారని, వెంటనే ఆటోను వెనక్కి మళ్లించాలని సూచించింది. ఈ విషయం డ్రైవర్‌కు చెప్పగా ఐఐటీకేనంటూ నమ్మించి మరో 10 కిలోమీటర్లు ముందుకు తీసుకెళ్లాడు. భయంతో కేకలు వేయగా బెదిరించి చేతిలో నుంచి మొబైల్‌ లాక్కున్నాడు. అప్రమత్తమైన ఆమె ఆటోలో నుంచి కిందకు దూకి ఓ కారును ఆపింది. తన పరిస్థితిని వివరించి అదే కారులో హత్నూర పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంది. విషయం తెలుసుకున్న జిన్నారం సీఐ వెంకటేశం, హత్నూర ఎస్‌ఐ రాజేశ్‌ నాయక్‌ పెట్రోలు పోయించుకున్న మల్కాపూర్‌ శివారులోని బంక్‌ వద్దకు వెళ్లి ఆరా తీశారు. పెట్రోలు పోసుకున్న సమయాన్ని తెలుసుకొని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Check Also

ఫేస్‌బుక్‌తో జాగ్రత్త!

ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ఖాతాల ద్వారా అపశ్రుతి జరిగి చాలా మంది బాధపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఎక్కువ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *