Home / slideshow / భార్య మాటకు విలువ

భార్య మాటకు విలువ

భార్య, భర్తలో సగ భాగమంటారు. అంటే ప్రతి భర్త తన జీవితంలో భార్యను బాధ్యతగా చూచుకోవడమేకాక ఆమెను గౌరవించడంతోపాటు, ఆమె మాటకు విలువనివ్వాలి. అప్పుడు పై మాటకు అర్థం ఉంటుంది.

భర్త, భార్యకు ఇవ్వవలసిన విలువలు

1) భార్యను బయటవారు లేదా ఇతరుల ముందు మట్లాడునప్పుడు గౌరవం ఇవ్వాలి.

2) భార్య ఏదైనా సమస్య మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు నిర్లక్ష్యంగా న్యూస్‌పేపర్‌గానీ, పుస్తకంగానీ చదవకండి.

3) భార్య టివీ చూస్తునప్పుడు ఛానెల్‌ మార్చితే ఆమెకు విలువలేదని బాధకు లోనవుతారు. అందువల్ల ఛానెల్‌ మార్చకండి.

4) భార్యకు ఇంటి పనులోగానీ, వంట పనులోగానీ సాయం చేసి ఆమెకు ఊరట, భరోసా ఇవ్వండి.

5) భార్య చేసిన కూర నచ్చకపోతే నిర్లక్ష్యంగా, నిర్మోహమాటంగా చెప్పకండి. సునితంగా, ప్రేమగా చెప్పండి.

6) భార్య పుట్టినరోజు గుర్తు పెట్టుకుని, ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలపండి. ఆమె ఎంతో సంతోషిస్తుంది.

7) భార్య,భర్త లిద్దరూ మనస్సు విప్పి ప్రశాంతంగా మాట్లాడునప్పుడు ఫోన్‌ తీయకండి.

8) ఒక వేళ పనిలోగానీ, ఏ ఇతర కారణలవల్ల రాత్రి ఆలస్యమయితే ముందుగా ఫోన్‌చేసి ఆమెకు సమాచారం అందించండి.

9) పిల్లల ముందు ఆమె ప్రాముఖ్యతను తెలియజేయండి.

10) భార్యకన్నా ముందుగా నిద్ర లేస్తే ఆమెకు కాఫీ ఇచ్చి గ్రీట్‌ చేయండి.

11) ఎప్పుడు ఇంట్లోనే ఉన్నామన్న భావన కలగకుండా వారానికి ఒక్కసారైనా రెస్టారెంట్‌కి తీసుకెళ్లండి.

12) భార్య చిరాకుగా, మూడీగా ఉన్నప్పుడు ఏమి జరిగిందని తెలుసుకోండి.

13) భార్యను బయటకు తీసుకెళ్లినప్పుడు ఆమెతోనే సమయాన్ని గడపండి. వీలైనంత వరకు కాల్స్‌కు దూరంగా ఉండండి.

14) కనీసం వారానికి నాలుగైదు సార్లు భార్యతో కలసి భోజనం చేయడం అలవాటు చేసుకోండి.

15) మీరేదైనా తప్పుగానీ, పొరబాటుగానీ చేసినప్పుడు నేను మగాడిని అని భావించకుండా క్షమాపణ కోరండి.

16) ఏ సందర్భంలో గానీ భార్య, భర్తల మధ్య మాటలులేని పరిస్థితి తెచ్చుకోకండి.

17) మీ బంధువులకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు భార్యకు తెలుపండి.

18) ఉదయాన్నే నిద్రలేచినప్పుడు బెడ్‌ను మీరే సర్దండి.

19) ఎప్పుడైనా బయటకుగానీ, పిక్‌నిక్‌లకు గానీ వెళ్లినప్పుడు హోటల్‌లో ఆమెను ఐటమ్స్‌ మోనూను ఆర్డర్‌ ఇవ్వమనండి.

20) ఏ విషయంలోనూ భార్యను నిరుత్సాహపరచకుండా, ఆత్మాభిమానం దెబ్బతిన్నకుండా ఎంకరేజ్‌ చేయండి.

21) భార్యకు ఆరోగ్యం సరిగాలేకుంటే పరిచర్యలు చేయండి.

22) భార్య ఏదైనా సమస్యలను మీకు చెబుతున్నప్పుడు ఆమె మాటలపై దృష్టి సారించండి.

Check Also

వాట్సప్‌లో రాబోతున్న మరిన్నికొత్త ఫీచర్లు

వాట్సప్ కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులో తేనుందే. ఆ రాబోవు ఫీచర్లు ఏంటో చూద్దాం. యూట్యూబ్‌ వీడియో ప్లే ఐఓఎస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *