Home / slideshow / ఫేస్‌బుక్‌తో జాగ్రత్త!

ఫేస్‌బుక్‌తో జాగ్రత్త!

ఈ మధ్య కాలంలో ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ఖాతాల ద్వారా అపశ్రుతి జరిగి చాలా మంది బాధపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఎక్కువ శాతం మగవారితో పోల్చితే ఆడవారికే ప్రమాదం పొంచి ఉంది. విద్యార్థినులు, యువతులు, మహిళలు ఎక్కువగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌ అభ్యంతరకరమైన పోస్టింగ్‌ల ద్వారా బాధపడుతున్నారు. మనము సాంకేతిక వరిజ్ఞానం పెరిగిందని సంతోషించాలో లేక బాధపడాలో తెలియడం లేదు. ఆడవారిని లక్ష్యంగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో ఇబ్బందికరమైన పోస్టింగ్‌లు పెరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వాడకంలో అవగాహన కలిగి ఉండాలి. ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్‌ ఖాతాలు సులువుగా తెరవచ్చు. దీంతో ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియాలైన ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ఖాతాలు కలిగి ఉన్నారు. కానీ వాటి వాడకంలో అవగాహన లేకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ఫేస్‌బుక్‌లో కనిపించే ఫొటోలు, వీడియోలు నిజమేనని నమ్మడంతో వాటికి కామెరట్లు ఇవ్వడం, లైక్‌లు కొడుతున్నారు. ఇది మనకు సరదాగా, ఉత్సాహంగా అనిపించిన్నా తర్వాత పరిణామాలు వేరుగా ఉంటున్నాయి. తెలియని ఫొటోలకు, వీడియోలకు కామెంట్లు ఇవ్వడం వల్ల మనకు తెలియకుండానే మన అకౌంట్‌ వివరాలు గుర్తుతెలియని వారి చేతిలో పెడుతున్నాం. కొందరు వాటిని ఆధారంగా చేసుకుని దారుణాలకు పాల్పడుతున్నారు. మరికొందరు తమకు పరిచయం ఉన్న వారితో, తమతో చదువుకుంటున్నా సహా విద్యార్థినులతో చనువుగా, మంచిగా ఉంటూ ఏదైనా సందర్భంలో వారితో ఫొటోలు దిగి, యువతుల ముఖాలను ఆశ్లీన ఫొటోలతో మార్ఫింగ్‌ చేసి, అదను చూసి వారిని వాటితో బ్లాక్‌మెల్‌ చేస్తున్నారు. అంతేకాక డబ్బులు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో వేధింపుల బాధితుల లిస్ట్‌లో తెలియని వారి కంటే పరిచయస్తులే ఎక్కువ. కొందరు అమ్మాయిలతో చనువుగా ఉంటూ ఫొటోలు దిగుతున్నారు. కొంత కాలం తర్వాత ప్రేమ, పెళ్లి ప్రస్తావన తెస్తున్నారు. అమ్మాయిలు నిరాకరిస్తే తమ వద్ద ఉన్న ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో అప్‌డేట్‌ చేస్తున్నారు.

అవగాహన లోపాలు

1) ఫేస్‌బుక్‌ను ఎలా ఉపయోగించాలో అవగాహన లేకపోవడం.

2) ఖాతా వివరాలను ఎలా భద్రపరచుకోవాలో తెలియకపోవడం.

3) అపరిచిత వ్యక్తులతో ఫొటోలు దిగడం

4) ఫొటోలు షేర్‌ చేయడం వల్ల కలిగే అనార్థాలు తెలియకపోవడం

5) ఏవరితో ఎలా మెలగాలో తెలియకపోవడం

పై చెప్పబడిన అవగాహన లోపాలను గుర్తించక యువతులు వేధింపులకు గురవుతున్నారు. అనంతరం కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయబోగా, మరికొందరు పోలీసులను ఆశ్రయించిన పరువుపోతుందనే ఉద్ధేశ్యంతో కేసు నమోదు చేయుటకు నిరాకరిస్తున్నారు. దీని కారణంగా యువతులకు, మహిళలకు, పాఠశాల, కళాశాల విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాన్ని కల్పించి అప్రమత్తం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. మహిళలకేకాక మగవారిలో కూడా ప్రమాదం ఎంతో కొంత లేకపోలేదు.

అందువల్ల ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్‌, వాట్సప్‌ల వంటి సోషల్‌ మీడియాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉంటేనే పై చెప్పబడిన లోపాలను అధికమించి సురక్షితంగా ఉండగలరు.

Check Also

వాట్సప్‌లో రాబోతున్న మరిన్నికొత్త ఫీచర్లు

వాట్సప్ కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులో తేనుందే. ఆ రాబోవు ఫీచర్లు ఏంటో చూద్దాం. యూట్యూబ్‌ వీడియో ప్లే ఐఓఎస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *