Home / ఈవ్స్ స్పెషల్ / ప్రేమను నిరాకరించిందని ఫోటోల మార్ఫింగ్

ప్రేమను నిరాకరించిందని ఫోటోల మార్ఫింగ్

తమ ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో ఓ యువతి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ చేసిన ఉన్మాదిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఆరు నెలలుగా సెల్‌ఫోన్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ, సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలను పోస్టింగ్ చేస్తూ వేధిస్తూ ఆ యువతిని భయభ్రాంతులకు గురిచేస్తున్న కొండబోయిన శ్యామ్‌ను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ హరినాథ్‌ వివరాల ప్రకారం.. ఓ పెళ్లిలో ఓ యువతితో ఏర్పడిన పరిచయంతో కొన్ని రోజులు స్నేహం చేసిన సమయంలో ఇద్దరూ కలిసున్న ఫొటోలను తన ఫోన్‌లో బంధించాడు శ్యామ్‌. ఆ తర్వాత ఓ దశలో అతను తీసుకువచ్చిన ప్రేమ ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఓ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని బాధితురాలి ఫొటోలను మార్ఫింగ్‌ చేశాడు. యువతి పేరుతో ఓ నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను తెరచి అందులో పోస్ట్ చేశాడు. స్నేహితులకు, బంధువులకు పంపించాడు. అతడి ఆగడాలు తాళలేక యువతి సైబర్‌ పోలీసులను ఆశ్రయించింది. కాల్‌డేటా ఆధారంగా నిందితుడిని గుర్తిచిన పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు.

Check Also

ఎయిర్‌టెల్ అమేజింగ్ ఆఫర్

జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ మరో రెండు అమేజింగ్ ఆఫర్లను మార్కెట్‌లో విడుదల చేసింది. అవేంటో చూద్దాం. ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *