Home / ప్రాఫిట్ గురు / పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల తగ్గింపు

పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల తగ్గింపు

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌) సహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఏప్రిల్‌ 1నుంచి వడ్డీరేటును 0.1శాతం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి గతంలో కంటే 0.1శాతం వడ్డీరేటు తగ్గుతుంది. దీంతో పీపీఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌(ఎన్‌ఎస్‌సీ), కిసాన్‌ వికాస్‌ పత్రా, సుకన్య సమృద్ధి ఖాతా, సీనియర్‌ సిటిజన్‌ పొదుపు ఖాతాలు సహా పలు పథకాలపై వడ్డీ శాతం తగ్గనుంది. తగ్గిన వడ్డీరేట్లు  అమలవుతాయి.

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌పై వడ్డీరేటు గతంలో 8శాతం ఉండగా ఇప్పుడు 7.9శాతానికి తగ్గించింది. సుకన్య సమృద్ధి యోజన పథకం, సీనియర్‌ సిటిజన్స్‌ అయిదేళ్ల పొదుపు ఖాతాకు వడ్డీరేటు 8.5శాతం ఉండగా దాన్ని 8.4శాతానికి తగ్గించింది. కిసాన్‌ వికాస్‌ పత్రా పథకానికి వడ్డీరేటు 7.6శాతానికి కుదించింది. .

Check Also

రూ. 249లతో రోజుకు 10జీబీ డేటా

బీఎస్‌ఎన్ఎల్ తన బ్రాండ్‌బ్యాండ్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ‘అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ యట్ 249’ పేరుతో నెలరోజుల పాటు రోజుకి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *