Home / హెల్త్ క్లినిక్ / పసుపుతో చుండ్రు మాయం

పసుపుతో చుండ్రు మాయం

పసుపు చాలా అద్భుతమైన ఔషదం అని చెప్పవచ్చు. అంతేకాక యాంటీ సెప్టిక్ గుణాలు ఇందులో ఉంటాయి. ఇది చర్మంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.  జుట్టు పెరుగుదలకు కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటం వల్ల చుండ్రును నివారణకు తోడ్పడుతుంది. పసుపుతో కొద్దిగా ఆలివ్ ఆయిల్ పోసి పేస్ట్‌ లా చేసి తలకు పట్టించి కొంత సమయం తర్వాత గోరువెచ్చని  నీటితో జుట్టును కడిగేయాలి. ఇలా చేస్తే తల చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. పసుపు కలిపిన హెనా ప్యాక్‌ను జుట్టుకు పట్టించి ఒక గంట తరువాత చల్లటి నీటితో కడిగితే జట్టు కాంతివంతమవుతుంది. అంతేకాక పసుపు, రోజ్ వాటర్‌ను కలిపి శరీరానికి మర్ధనా చేసుకుంటే చర్మం నిగనిగలాడటంలో దోహదం చేస్తుంది.

Check Also

అన్ని జుట్టు సమస్యలకు మెంతులు

వెంట్రుకలు రాలకుండా ఉండడానికి ఎంతో ఉపకరిస్తుంది. మెంతుల పేస్ట్ తలకు పట్టిస్తే వెంట్రులు రాకుండా ఉంటుంది. శరీరం చల్లబడటంలో కూడా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *