Home / ధర్మ సందేశ్ / దత్తాత్రేయ స్మరణం…సర్వపాప హరణం

దత్తాత్రేయ స్మరణం…సర్వపాప హరణం

గురుతత్వానికి ఆది గురువు దత్తాత్రేయస్వామి. దత్తాత్రేయుని భక్తితో స్మరించిన సమస్త పాపములు హరించబడుతాయి. ఆయనను పూజలతో సేవించకపోయినా కేవలం పవిత్ర భావనతో, భక్తిశ్రద్ధలతో దత్తత్రేయస్వామి అని స్మరిస్తే చాలు, ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని రక్షించి మనం కోరిన కోరికలు తీరుస్తాడు అని ప్రతీతి.

దత్త జయంతి రోజున తెల్లవారు జామున భక్తులు నదీస్నానం లేదా సేలఏటి స్నానం చేయాలి. దత్తత్రేయస్వామికి షోడశోపచారాలతో పూజ చేయాలి. ఈ రోజు జప ధ్యానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందంటారు. ఈ రోజు ఉపవాసం చేసి దత్త చరిత్రను పారాయణం చేయాలి. తదుపరి ఈ శ్లోకాన్ని పఠించాలి.

దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః

తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః

Check Also

యోగ సాధనలో మంచి ఫలితాలకోసం…

యోగా సాధనలో భాగంగా కొన్ని శరీరక, మానసిక నియమాలు తప్పని సరిగా ఆచరించాలి.ఉదయం యోగాను అభ్యసించేటప్పుడు మనస్సు ప్రశాంతంగా, తాజాగా, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *