Home / slideshow / తేనెతో శ్వాసకోస సమస్యలు దూరం

తేనెతో శ్వాసకోస సమస్యలు దూరం

జ‌లుబు, ద‌గ్గు, బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్షన్లలను తేనెతో దూరం చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మర‌సంను ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో క‌ల‌పాలి. ఈ ద్రవంతో జ‌లుబు, ద‌గ్గు వంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుది. ఈ ద్రవంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాల వల్ల ద‌గ్గు నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్యల‌ను దూరం చేస్తుంది.

ప్రతి రోజూ తేనెను తీసుకుంటే అనేక ర‌కాల ఇన్‌ఫెక్షన్లు దరిచేరనివ్వదు. వ‌ర్షాకాలంలో వచ్చే ఉదర సంబంధిత ఇన్‌ఫెక్షన్లు, ఫుడ్ పాయిజ‌నింగ్ సమస్యలను దూరం చేస్తుంది. ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ అల్లం రసం, కొద్దిగా నిమ్మర‌సంల‌ను కలిపి ప్రతి రోజూ తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా కాపాడుతుంది. తేనెలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుచేత తేనె అనేక ర‌కాల బాక్టీరియా, వైరస్‌, సూక్ష్మ క్రిముల‌ను అడ్డుకుని నాశనం చేస్తుంది.

Check Also

వాట్సప్‌లో రాబోతున్న మరిన్నికొత్త ఫీచర్లు

వాట్సప్ కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులో తేనుందే. ఆ రాబోవు ఫీచర్లు ఏంటో చూద్దాం. యూట్యూబ్‌ వీడియో ప్లే ఐఓఎస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *