Home / slideshow / టీ లో అద్భుత లక్షణాలు

టీ లో అద్భుత లక్షణాలు

టీ తాగితే మతిమరుపు తగ్గుతుంది. టీ తాగితే 50 శాతం డిమెన్షియా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని నిపుణుల అభిప్రాయం.
టీ ఆకుల్లో ఉండే పోషకాలైన క్యాటెచిన్స్, థియాఫ్లేవిన్స్‌ వల్ల మెదడు కణాలపై పడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ ప్రభావాలతో మెదడులో వాస్క్యులార్‌ డ్యామేజీ, న్యూరోడీజెనరేషన్‌‌ను తగ్గిస్తుందే. అందువల్ల టీ తాగితే మతిమరపు, డిమెన్షియా, అల్జైమర్స్, పార్కిన్‌సన్స్‌ వంటి వ్యాధులు దూరమవుతాయి. అయితే రోజుకు మూడు కప్పులు మించకూడదు. టీతో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కెఫిన్ కాఫీలో కంటే టీలో తక్కువగా ఉండటం వల్ల శరీరం ఉత్తేజం, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. కెఫిన్ మన శరీరంపై సున్నిత ప్రభావాన్ని చూపెడుతుంది
2. టీ తాగడం వల్ల ఎముకలను దృఢంగా ఉంటాయి. దీర్ఘాకాలంగా టీ తాగితే ఎముకలు చాలా బలంగా ఉంటాయి అని పరిశోధనలో తేలింది.
టీ తాగితే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. టీ తాగితే రక్తనాళాలు సాగే గుణం కలిగి రక్త కణాల్లో క్రొవ్వు చేరకుండా చేస్తుంది. టీ తాగడం వల్ల గుండె మరియు రక్తనాళాల సమస్యలను తగ్గిస్తుంది.
గ్రీన్ టీ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. జీవక్రియ మెరుగ్గా జరిపేందుకు దోహదపడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల అధిక క్రొవ్వు కరుగుతుంది. గ్రీన్ టీని తక్కువ పంచదార వేసుకుని తాగాలి. బరువు తగ్గాలంటే పాలు, చక్కెర లేని బ్లాక్‌ టీని గానీ, లెమన్‌ టీని గానీ తాగితే బరువు తగ్గుతారు. టీ వల్ల శారీరక అందం మెరుగవుతుంది. చర్మానికి, జుట్టుకు రక్షణ ఇవ్వడంలో తోడ్పడుతుంది. అన్నవాహిక సంబంధ వ్యాధులు, ఎసిడిటి సమస్యలు, అండాశయ వ్యాధులు, చర్మ వ్యాధులు, చర్మ క్యాన్సర్ లాంటి వ్యాధులను టీ తగ్గిస్తుంది. శారీరక, మానసిక అలసటను తగ్గిస్తుంది. గ్రీన్ టీ బ్యాగులను అర లీటరు నీటిలో కలిపి మరిగించి చల్లార్చి, ఫ్రిజ్‌లో పెట్టి చల్లటి టీ ద్రవాన్ని ముఖంపై చల్లితే అలసటను తగ్గిస్తుంది.

Check Also

వాట్సప్‌లో రాబోతున్న మరిన్నికొత్త ఫీచర్లు

వాట్సప్ కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులో తేనుందే. ఆ రాబోవు ఫీచర్లు ఏంటో చూద్దాం. యూట్యూబ్‌ వీడియో ప్లే ఐఓఎస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *