Home / యంగ్ తరంగ్ / జీతం ఉందిగా …లంచం నాకెందుకు?

జీతం ఉందిగా …లంచం నాకెందుకు?

అవినీతి విలయతాండవం చేస్తున్న ఈ రోజుల్లో…ఇలా ఓ ప్రభుత్వోద్యోగి చెప్పడం మీరెక్కడైనా విన్నారా! వేలకు వేలు వేతనాలు అందుకుంటున్నా లంచం కోసం కక్కుర్తి పడుతూ నిరుపేదలను కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిప్పుకునే ప్రభుత్వ సిబ్బంది ఆయనను చూసి సిగ్గుతో తలదించుకోక తప్పదు. చేతులు తడపందే పనులు జరగదనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నేపథ్యంలో ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించే అధికారులు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నారనడానికి ఆయనో నిదర్శనంగా నిలుస్తున్నారు. కేర‌ళ‌లోనే అతిపెద్దదైన ప‌ల్లియ‌ల్‌తోడి అంగ‌డిపురం పంచాయ‌తీ ఆఫీసులో క్లర్క్ గా పని చేస్తున్న 42 ఏళ్ల అబ్దుల్ స‌లీమ్ లంచం వద్దని చెప్పడానికి స‌రికొత్త ప‌ద్దతిని  అవ‌లంబిస్తూ. అంద‌రితో భేష్ అనిపించుకుంటున్నాడు. ప్రజలకు సేవ చేయడానికి తనకు ప్రభుత్వం నెలకు రూ.24,340  చెల్లిస్తున్నందున తనకు లంచం అవసరం లేదని చెప్పేలా త‌ను ప‌నిచేసే డెస్క్ వ‌ద్ద ఒక బోర్డు ఉంచాడు. త‌న సేవ‌ల‌తో తృప్తి పొంద‌కుంటే త‌న‌కు చెప్పాల్సిందిగా ఆ బోర్డుపై రాసి ఉంచాడు.

గ‌త‌మూడేళ్లుగా ఆ పంచాయ‌తీ ఆఫీసులో ప‌నిచేస్తున్న స‌లీం త‌న పే స్కేల్ మారిన‌ప్పుడ‌ల్లా క్రమం తప్పకుండా త‌న జీతం బోర్డుపై రాస్తున్నారు. స‌లీం ఆఫీసు ప‌నుల‌కే ప‌రిమితం కాడు. స‌హాయం కోరి ఎవ‌రైన త‌న‌ దగ్గరకు వచ్చే వారికి త‌న‌కు చేత‌నైనంత స‌హాయం చేస్తాడ‌న్న మంచి పేరుంది.  40శాతం పోలియోతో బాధ‌ప‌డుతున్నప్పటికీ స‌లీం ఏనాడు అది చూసి కుంగిపోలేదు. ధైర్యంగా ఫీల్డ్ ట్రిప్పులు కూడా వేస్తుంటాడు. తోటి సిబ్బందికి స‌లీం చాలా ఆద‌ర్శంగా నిలుస్తున్నాడ‌ని ఆయ‌న పై అధికారులు చెబుతున్నారు. అంతేకాదు చాలామంది గ్రామ‌స్తులు ఆఫీసుల‌కొచ్చి త‌మ‌కు కావాల్సిన ప‌నిని సంతోషంగా పూర్తి చేసుకుని పోతున్నారంటే స‌లీం వ‌ల్లేన‌ని కొనియాడారు.

Check Also

ఎయిర్‌టెల్ అమేజింగ్ ఆఫర్

జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ మరో రెండు అమేజింగ్ ఆఫర్లను మార్కెట్‌లో విడుదల చేసింది. అవేంటో చూద్దాం. ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *