Home / ఈవ్స్ స్పెషల్ / చర్మం నల్లబడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

చర్మం నల్లబడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

వాతావరణంలో మార్పులు, ఎండా వల్ల చర్మం నల్లబడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి.

చలికాలంలో చర్మం పగుళ్ళు, ఎండకాలంలో చర్మం టానింగ్‌ సమస్యలకు గురవుతుంది. అంతేగాక నల్లబడుతుంది. ఇటువంటి టానింగ్‌ చర్మ సమస్యను నివారించడానికి వంటింటి వైద్యం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ చిట్కా అరగంటలో స్కిన్‌ టాన్‌ను నివారిస్తుంది.మొదట కొద్దిగా పంచదార పొడిని తీసుకోవాలి. అందులో రోజ్‌ వాటర్‌ మరియు ఆలివ్‌ నూనె రెండు కలిపి బయట ఎండల్లోంచి ఇంటికి వచ్చాక ముఖం, ముక్కు మీద సున్నితంగా మర్దన చేస్తే మీ చర్మం అస్సలు నల్లబడదు. మిశ్రమాన్ని ఉదయం పూట స్నానానికి ముందు, రాత్రి పడుకోబోయే అరగంట ముందు రాసుకుని కడిగేయాలి. అనంతరం కొద్దిగా మాయిశ్చరైజింగ్‌ క్రీములైన వాస్లిన్‌ లేదా కోల్డ్‌ క్రీం రాసుకోవాలి. చర్మం డీటానింగ్‌ కోసం పైన సూచించిన నేచురల్‌ డీటానింగ్‌ మాస్క్‌ను ఉపయోగించడం వల్ల చర్మం మీద డార్క్‌ ప్యాచ్‌లు నివారిస్తుంది. చర్మం టానింగ్‌ తొలగిపోతుంది. స్కిన్‌ టానింగ్‌కు గురవడానికి అనేక కారణలున్నాయి. చర్మంలో ఉండే మెలనిన్‌ అనే పింగ్మెంట్‌ చర్మ రంగులో మార్పు తీసుకువస్తుంది. సూర్యరశ్మి నుండి వెలువడే యూవీకిరణాలు, మెలనిన్‌ను అథ్యధికంగా స్రవించడం వల్ల చర్మం నల్లగా మారుతుంది. దీన్నే స్కిన్‌ టానింగ్‌ అంటారు. స్కిన్‌ టానింగ్‌ నివారించుకోవడానికి బాడీ స్క్రబ్‌ బాగా సహాయపడుతుంది. పంచదార వల్ల చర్మంకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందులో భాగంగా ముఖ చర్మంలో డెడ్‌స్కిన్‌ సెల్స్‌ను తొలగిస్తుంది. పంచదార చర్మంను బాగా శుభ్రం చేయడానికి దోహదవడుతుంది. ఇది చర్మంలో మురికి, మలినాలను తొలగించడంలో బాగా పనిచేస్తురది. పంచదారలో ఉండే గ్లైకోలిక్‌ యాసిడ్‌, చర్మంను పూర్తిగా మాయిశ్చరైజ్‌ చేస్తుంది. ఇంకా చర్మంలో మూసుకుపోయిన స్వేద రంద్రాలను శుభ్రపరుస్తుంది. చర్మంలో జిడ్డు, నూనెతత్వాలను తొలగిస్తుంది.

Check Also

అన్ని జుట్టు సమస్యలకు మెంతులు

వెంట్రుకలు రాలకుండా ఉండడానికి ఎంతో ఉపకరిస్తుంది. మెంతుల పేస్ట్ తలకు పట్టిస్తే వెంట్రులు రాకుండా ఉంటుంది. శరీరం చల్లబడటంలో కూడా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *