Home / హ్యాపీ న్యూస్ / ఇన్ఫో-న్యూస్ / గోంగూరతో రేచీకటి దూరం

గోంగూరతో రేచీకటి దూరం

గోంగూరలో పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, సోడియం, ఐరన్‌లు పుష్కలంగా ఉంటాయి. గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి సంమృద్ధిగా ఉంటుంది. గోంగూరలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండి, క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటుంది. గోంగూరలోని విటమిన్‌-ఎ అధికంగా ఉండటం వల్ల రేచీకటి రాకుండా చేస్తుంది. గోంగూరలోని కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్‌లు శరీర బరువును తగ్గించడంలో తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్తపోటును అదుపు చేస్తుంది. అంతేకాక గోంగూర చర్మ సంబంధ సమస్యలను తొలగిస్తుంది. గోంగూరని క్రమం తప్పకుండా తింటే నిద్రలేమి, అధిక రక్తపోటు తగ్గుతుంది. రోజూ నిద్ర పోయే ముందు ఒక కప్పు గోంగూర రసం తాగితే నిద్ర బాగా పడుతుంది. గోంగూర ఆకుల మిశ్రమాన్ని తలకు పట్టించి స్నానం చేస్తే వెంట్రుకలు ఊడదు. గోంగూరలో కాల్షియం ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

Check Also

వాట్సప్‌లో రాబోతున్న మరిన్నికొత్త ఫీచర్లు

వాట్సప్ కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులో తేనుందే. ఆ రాబోవు ఫీచర్లు ఏంటో చూద్దాం. యూట్యూబ్‌ వీడియో ప్లే ఐఓఎస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *