Home / ప్రాఫిట్ గురు / క్రియేటివ్ రచయిత్రులకు ఇంటిలోనే ఉపాధి

క్రియేటివ్ రచయిత్రులకు ఇంటిలోనే ఉపాధి

money

భిన్నంగా ఆలోచించే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది హిందూ విషయంలో మరోసారి నిరూపితమైంది. తాను విజయవంతమైన జీవితాన్ని గడుపుతుండడమే కాక, సుమారు యాభై మంది ప్రతిభావంతులైన గృహిణులకు కూడా జీవనోపాధి మార్గాన్ని చూపిన ఆమె నేటి మహిళలకు ఆదర్శప్రాయురాలేనని చెప్పాలి. చెన్నైలో కాలేజీ చదువు పూర్తి చేసుకున్న వెంటనే ఆమె తల్లిదండ్రులు 19 ఏళ్ల కల్లా పెళ్లి చేసి, అమెరికా పంపించేశారు. అక్కడ కంప్యూటర్ సైన్స్ చదివిన ఆమె ఐ.బి.ఎం, నాసా ఎమెస్ లాంటి సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో అమెరికాలో పనులన్నీ భారత్‌కు అవుట్‌సోర్స్ చేయడంతో అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాది మందిలో ఆమె కూడా ఉన్నారు. దీంతో అక్కడ కొనసాగలేక భారత్‌కు తిరిగొచ్చిన ఆమె తోచిన పనులను చేసుకుంటూ వచ్చారు. చివరకు తన సోదరి పర్యవేక్షణలో చెన్నైలో ఓ కార్యాలయాన్ని ప్రారంభించి, అమెరికాలో ఉన్న వారికి వెబ్ సైట్, ఇమెయిల్ ఆరంభించే పనులు చేపట్టారు. దానికి మంచి ఆదరణ లభించడంతో మరో అడుగు ముందుకు వేశారు. వృత్తి నిపుణులకు ఇంటర్నెట్ మార్కెటింగ్ గురించి అవగాహన కల్పించి, తద్వారా తనంత తానుగా కొత్త వ్యాపార అవకాశాన్ని సృష్టించుకున్నారు. అంటే, స్థానికంగా గొప్ప పేరు ఉన్న ఓ వృత్తి నిపుణుడి, సంస్థ గురించిన సమాచారాన్ని తయారు చేసి, విస్తృతంగా ఇంటర్నెట్ ద్వారా ప్రచారం కల్పించడం. ఆ వ్యక్తుల గురించిన గొప్ప విషయాలను ఇంటర్నెట్ ద్వారా సేకరించి, కొత్తగా సృజనాత్మకమైన రీతిలో కథనాలు రాసేందుకు దేశం నలుమూలలా కొంత మంది మహిళలను ఎంపిక చేశారు. ప్రస్తుతం సుమారు యాభై మంది మహిళలు ఇలా ఇంటినుంచే ఆమె వద్ద పని చేస్తున్నారు. వీరికి ప్రతిరోజూ మెసెంజర్ ద్వారా అసైన్‌మెంట్ ఇస్తారు. ఆ ప్రకారం ఆ మహిళలు సంబంధిత వ్యక్తి, సంస్థ గురించిన కథనాలు రాస్తారు. ఇలా రాసిన కథనాన్ని ఆమె సంస్థలోని ఎడిటర్లు సరిచేసి, సంబంధిత వృత్తి నిపుణుడు, సంస్థ ఆమోదం కోసం పంపిస్తారు. వారి ఆమోదం పొందిన తర్వాత దానిని రాసిన మహిళే సోషల్ వెబ్‌సైట్ ద్వారా వివిధ వర్గాల దృష్టికి దానిని తీసుకువెళుతారు. ఇలా చేయడం ద్వారా చాలా మంది మహిళలు నెలకు 10నుంచి 15వేల రూపాయలవరకు సంపాదిస్తున్నారని ఆమె చెబుతున్నారు. ఇంకా ప్రోగ్రామింగ్ తెలిసిన మహిళలయితే నలభై వేల వరకు కూడా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం తమ క్లయింట్లందరూ అమెరికాలోనే ఉన్నందున ఆంగ్లంలో రాసేవారికే ప్రాధాన్యమిస్తున్నామన్నారు. భారత్‌లో తమకు క్లయింట్లు వస్తే ఇంకా చాలామందికి అవకాశం కల్పించగలమని ఆమె చెబుతున్నారు. ఈ ఆలోచనను మనం కూడా మన దృష్టిలో పరిశీలిస్తే విజయం సాధించగలం కదా. ఆమె సంస్థకు సంబంధించిన వివరాలకు www.localbiznetwork.com వెబ్‌సైట్‌ను వీక్షించగలరు.

భిన్నంగా ఆలోచించే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది హిందూ విషయంలో మరోసారి నిరూపితమైంది. తాను విజయవంతమైన జీవితాన్ని గడుపుతుండడమే కాక, సుమారు యాభై మంది ప్రతిభావంతులైన గృహిణులకు కూడా జీవనోపాధి మార్గాన్ని చూపిన ఆమె నేటి మహిళలకు ఆదర్శప్రాయురాలేనని చెప్పాలి. చెన్నైలో కాలేజీ చదువు పూర్తి చేసుకున్న వెంటనే ఆమె తల్లిదండ్రులు 19 ఏళ్ల కల్లా పెళ్లి చేసి, అమెరికా పంపించేశారు. అక్కడ కంప్యూటర్ సైన్స్ చదివిన ఆమె…

0%

User Rating: 4.58 ( 2 votes)
0

Check Also

రూ. 249లతో రోజుకు 10జీబీ డేటా

బీఎస్‌ఎన్ఎల్ తన బ్రాండ్‌బ్యాండ్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ‘అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ యట్ 249’ పేరుతో నెలరోజుల పాటు రోజుకి ...

3 comments

  1. Very useful article!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *