Home / slideshow / కీరదోస కాయ వల్ల లాభాలు

కీరదోస కాయ వల్ల లాభాలు

కీరదోస కాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. కీరదోస కాయలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల బీపీ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం అని చెప్పవచ్చు. శరీరం కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందిస్తుంది. చర్మ సౌందర్యం మెరుగుపరచడానికి కూడా దీని ఉపయోగిస్తారు. కీరదోస రసంలో ఫొలేట్‌తో పాటు విటమిన్ ఎ, సిలు పుష్కలంగా లబిస్తుంది.

  • కీరదోస కాయలోని పొటాషియం రక్తపోటును సమన్వయ పరచి క్రమబద్దీకరిస్తుంది. శరీరానికి చలువ చేస్తుంది. కీరదోసను తొక్కతోనే తినాలి.
  • కీరదోసలోని లవణాలు గోళ్లను చిట్లకుండా చేసి అందంగా ఉంచుతంది.
  • కీరదోస ముక్కలు కళ్ల కింద నల్లటి చారలను  తొలగిస్తుంది. ఉబ్బిన కళ్లపై తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే మంచి ఫలితానిస్తుంది .
  • కీరదోసలో సల్ఫర్ , సిలికాన్ ఉండటం వల్ల శిరోజాల పెరుగుదలకు సహాయపడి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది .
  • కీరదోస కడుపులో మంటను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరచడంలో దోహదం చేస్తుంది .
  • కీరదోస తొక్కలోని విటమిన్ కె  పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి మేలు చేస్తుంది.
  • కీరదోసకాయ ఎసిడిటిని సమస్యను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను క్రమబద్దీకరిస్తుంది.
  • కీరదోసకాయ రసం గ్యాస్ట్రిక్ , డియోడినం అల్సర్లకు ఉపశయనం కలిగిస్తుంది .  ఇందులోని ఖనిజాలు సోడియంను నియంత్రణకు సహాయపడుతుంది .
  • కీరదోషకాయ రసాన్ని ఆకుకూరల రసంతో కలిపి తాగితే చలువ చేస్తుంది.
  • కీరదోస కాయ మూత్రపిండాలలో రాళ్లును కరిగించడమేకాక మూత్ర విసర్జన చక్కగా జరగడానికి సహాయపడుతుంది
  • కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను తొలగించి వాపు , నొప్పి తగ్గిస్తుంది.

Check Also

వాట్సప్‌లో రాబోతున్న మరిన్నికొత్త ఫీచర్లు

వాట్సప్ కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులో తేనుందే. ఆ రాబోవు ఫీచర్లు ఏంటో చూద్దాం. యూట్యూబ్‌ వీడియో ప్లే ఐఓఎస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *