Home / విన్నర్స్ ఫోకస్ / హెల్త్ ఫోకస్ / ఉల్లిపాయతో వడదెబ్బకు విరుగుడు

ఉల్లిపాయతో వడదెబ్బకు విరుగుడు

వేసవి కాలంలో వడదెబ్బకు గురవుతుండడం గురించి మనం తరచూ వింటూనే ఉన్నాం. వాటికి సంబంధించిన నివారణా మార్గాలను పరిశీలించి, అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉల్లిపాయరసాన్ని శరీరానికి పట్టించడం ద్వారా వడదెబ్బనుంచి కాపాడుకోవచ్చు.  వేసవి ఎండలో నడవాల్సి వచ్చినపుడు ఒక ఉల్లిపాయను టోపిలో గాని , రుమాలులో గాని నడినెత్తిన ఉండునట్లు కట్టి నడిచిన వడదెబ్బ తగలదు. జేబులో నైనా ఉంచుకోవచ్చు. నీరుల్లిపాయ రసం రెండు కనతలకు , గుండెకి పూసిన వడ దెబ్బవలన కలిగిన బాధ హరిస్తుంది. వడదెబ్బ తగిలిన ముఖము పైన , శరీరం పైన నీళ్లు చల్లుతూ , తలపైన మంచు గడ్డలను వుంచి త్రాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.

కుమ్మున ఉడికించిన మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనంతో పాటు త్రాగుతుంటే వదబెబ్బ తగలదు.  విశ్రాంతిగా పడుకోపెట్టి కాఫీ తాగుటకు ఇచ్చిన వడదెబ్బ నుండి తట్టుకొంటారు. నాలుగు తులాల చల్లటి నీటిలో ఒక తులం తేనెని వేసి కలిపి ఇస్తే వడదెబ్బ నివారణ అవుతుంది. వడగండ్లు పడినప్పుడు ఏరి విబూతిలో వేసి దాచి వడదెబ్బ తగిలినపుడు వారికి మూడువేల్లకు వచ్చినంత మంచినీటిలో వేసి ఇచ్చిన ఎండదెబ్బ నివారణ అగును.

నువ్వులనూనేలో చనుబాలు రంగరించి చెవులలో వేసి కొంచం వెచ్చటి నీళ్లలో నెయ్యివేసి ఇచ్చిన వడదెబ్బ బాధలు తగ్గును.  తాటి ముంజలను పంచదారతో ఇవ్వవచ్చు. నాలుకకు పాత ఉసిరి పచ్చడి రాసి , పుల్లని ఆవు మజ్జిగలో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసాన్ని త్రాగించ వలెను. చన్నీటితో స్నానం చేయాలి.  వేడివేడి పల్చని గంజిలొ ఉప్పు వేసి త్రాగవలెను. నిమ్మ ఉప్పుని నోటిలో వేసుకోనిన నాలుకకు ఉట ఊరి వడదెబ్బ నివృత్తి అగును.

Check Also

అన్ని జుట్టు సమస్యలకు మెంతులు

వెంట్రుకలు రాలకుండా ఉండడానికి ఎంతో ఉపకరిస్తుంది. మెంతుల పేస్ట్ తలకు పట్టిస్తే వెంట్రులు రాకుండా ఉంటుంది. శరీరం చల్లబడటంలో కూడా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *