Home / న్యూస్‌ రౌండప్ / ఇక డెబిట్, క్రెడిట్ కార్డులకూ మంగళం

ఇక డెబిట్, క్రెడిట్ కార్డులకూ మంగళం

త్వరలో ఏటీఎం, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అభిప్రాయపడ్డారు. లావాదేవీలకు మొబైల్‌ వ్యాలెట్లు, బయోమెట్రిక్‌ పద్ధతులు వినియోగిస్తుండటం ఇందుకు ప్రధాన కారణమన్నారు. ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫెసిలిటేషన్‌ సర్వీసెస్‌(టీఐఎఫ్‌ఎస్‌) ప్రారంభ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత వృద్ధిలో టెక్నాలజీ కీలకమని అన్నారు. బ్యాంకింగ్‌ సేవలు దాదాపు నిర్జీవమైనట్లే. వచ్చే మూడు, నాలుగేళ్లలో ఈ రంగంలో టెక్నాలజీ మరింత విస్తృతమవుతుంది. లావాదేవీలు మొబైల్‌ వ్యాలెట్లు, బయోమెట్రిక్‌ పద్ధతులకు మారిపోతాయి. క్రెడిట్‌, డెబిట్‌, ఏటీఎం కార్డులు కనుమరుగవుతాయన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న నేపథ్యంలో భారత్‌ 7.6శాతం వృద్ధిరేటును సాధించడం విశేషమన్నారు. అమెరికా, యూరప్‌లలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటే.. భారత్‌లో యువరక్తం ప్రవహిస్తోందన్నారు.

Check Also

ఎయిర్‌టెల్ అమేజింగ్ ఆఫర్

జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ మరో రెండు అమేజింగ్ ఆఫర్లను మార్కెట్‌లో విడుదల చేసింది. అవేంటో చూద్దాం. ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *