Home / రివ్యూ రిపోర్ట్ / ఆగదు ఎ నిమిషము నీకోసము

ఆగదు ఎ నిమిషము నీకోసము

ఆగదూ ఆగదూ ఆగదూ
ఆగదు ఎ నిమిషము నీకోసము
ఆగితే సాగదు ఈ లోకము
ముందుకు సాగదు ఈ లోకము ||ఆగదు||
జాబిలి చల్లనని వెన్నెల దీపమని
తెలిసినా గ్రహణము రాక మానదు
పూవులు లలితమని తాకితే రాలునని
తెలిసినా పెనుగాలి రాక ఆగదు
హృదయము అద్దమని పగిలితె అతకదని
తెలిసినా మృత్యువు రాక ఆగదూ
హ హహ హహ హ
ఈ మనిషి తపన ఆగదు ||ఆగదు||
జీవితమొక పయనమని గమ్యము తెలియదనీ
తెలిసినా ఈ మనిషి పయనమాగదు
జననం ధర్మమని మరణం ఖర్మమని
తెలిసినా జనన మరణ చక్రమాగదు
మరణం తధ్యమని ఈ జీవికి తప్పదని
తెలిసినా మనిషి తపన ఆగదు
హ హహ హహ హ
ఈ మనిషి తపన ఆగదు ||ఆగదు||

Check Also

స్మార్ట్ ఫోన్ వేడెక్కితే ప్రమాదం

ప్రస్తుతం చాలామంది ఉపయోగించే స్మార్ట్ ఫోన్లలో,గేమ్స్ ఆడుతున్నప్పుడో ఎక్కువసేపు మాట్లాడుతున్నప్పుడో,నెట్ ను బాగా వాడుతున్నప్పుడో,మీ ఫోన్ ని హీట్ అవ్వడం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *