Home / న్యూస్‌ రౌండప్ / అగ్రిగోల్డ్‌ కేసులో ఇద్దరు డైరెక్టర్ల అరెస్టు

అగ్రిగోల్డ్‌ కేసులో ఇద్దరు డైరెక్టర్ల అరెస్టు

అగ్రిగోల్డ్‌ కేసులో ఆ సంస్థ డైరెక్టర్లుగా ఉన్న విజయవాడకు చెందిన సవరం శ్రీనివాసరావు(54), విశాఖపట్నానికి చెందిన డొప్పా రామ్మోహన్‌రావు(43)లను విజయవాడలో రాజమండ్రి సీఐడీ అధికారులు శనివారం అరెస్టు చేశారు. సీఐడీ అదనపు ఎస్పీ హరికృష్ణ ఆధ్వర్యంలో అరెస్టు చేసిన. నిందితులిద్దరినీ ఏలూరులోని జిల్లా కోర్టులో హాజరగా.. నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. నిందితులు ఇద్దరినీ ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు. నిందితులు పలు కీలకమైన అంశాలను వెల్లడించారని, అగ్రిగోల్డ్‌ ఆస్తులు రాజకీయ నేతల వద్ద బినామీగా ఉన్నాయని, ముఖ్యంగా ఒడిసా, కర్ణాటక, తెలంగాణ రాషా్ట్రల్లో ఆస్తులు ఉన్నాయని నిందితులను కోర్టు అనుమతితో సీఐడీ కస్టడీకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.

Check Also

ఎయిర్‌టెల్ అమేజింగ్ ఆఫర్

జియో ప్రకటించిన సరికొత్త ఆఫర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ మరో రెండు అమేజింగ్ ఆఫర్లను మార్కెట్‌లో విడుదల చేసింది. అవేంటో చూద్దాం. ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *